ఏపీ సీఎం తిరుమల టూర్: నూతన ప్రాజెక్టులకు శ్రీకారం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నేడు, రేపు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతికి చేరుకోనున్న ఆయన, అనంతరం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి దర్శనంతో పాటు బేడి ఆంజనేయస్వామిని కూడా దర్శించుకుంటారు.

పర్యటనలో భాగంగా రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, నవీకరించిన ఎస్వీ మ్యూజియంలను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద పర్యావరణహిత ఈవీ బస్సులను సీఎం జండా ఊపి ప్రారంభించనున్నారు. వీటితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని రేపు మధ్యాహ్నం ఆయన ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>