epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. దేశ ప్ర‌జ‌ల‌కు ఖ‌ర్గే పిలుపు

క‌లం వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు(New Year wishes) తెలియజేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సందేశంలో ఈ కొత్త ఏడాదిని బలహీన వర్గాల హక్కులను కాపాడే ఉద్యమంగా మార్చుకుందామ‌ని పిలుపునిచ్చారు. దేశ పౌరులంద‌రికీ కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు అని చెప్తూ, ఈ ఏడాదిని బలహీనుల హక్కుల కోసం పెద్ద ఉద్యమంగా మార్చుకుందామ‌ని ఖ‌ర్గే పిలుపునిచ్చారు. పని చేసే హక్కు, ఓటు వేసే హక్కు, గౌరవంగా బతికే హక్కు.. ఇలా అన్నింటికి కాపాడుకుందామ‌న్నారు. మన రాజ్యాంగాన్ని (Constitution), ప్రజాస్వామ్యాన్ని(Democracy) రక్షించుకోవాల‌ని సూచించారు. ప్రజలను బలపరచడం, సమాజంలో ఐక్యతను పెంచడ‌మే లక్ష్యంగా ప‌ని చేయాల‌న్నారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు భద్రత, రైతులకు సంపద, అణచివేతకు గురైన వాళ్లకు గౌరవం, అందరికీ మంచి జీవితం సాధించాల‌ని చెప్పారు. ఈ కొత్త ఏడాది అందరి జీవితాల్లో సంతోషం, సమృద్ధి, ప్రగతి తెచ్చి పెట్టాలని మనసారా కోరుకుంటున్నానంటూ త‌న సందేశంలో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>