కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab) జనవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రీమియర్స్ జనవరి 8న ఉండబోతున్నాయి. అటు యూఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ సందర్భంగా యూఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ లో మూవీ జోరు చూపిస్తోందని అంటున్నారు టీమ్. ఇప్పటికే 3లక్షలకు పైగా టికెట్లు సేల్ అయినట్టు తాజాగా పోస్టర్ వదిలింది మూవీ టీమ్. బుకింగ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయని.. ఈ నెంబర్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు మేకర్స్.
మారుతి (Maruthi) డైరెక్షన్ లో వస్తున్న ఈ ది రాజాసాబ్ (The Raja Saab) ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ట్రైలర్ తో వచ్చిన హైప్ తో అడ్వాన్స్ టికెట్లలో కూడా జోష్ కనిపిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. పైగా వీఎఫ్ ఎక్స్ కూడా బాగుండటంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.
Read Also: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన మీనాక్షి చౌదరి?
Follow Us On: Youtube


