కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జాగృతి జనంబాట కార్యక్రమం చేపట్టి నిత్యం ఆమె వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కవితకి చెందిన వాహనం (Kavitha Vehicle)పై భారీ సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు వెల్లడవుతోంది. తెలంగాణ పోలీసుల ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న చలాన్ల జాబితా ప్రకారం, ఆమె వాహనం (TS09EU6666)పై మొత్తం 16 ఓవర్ స్పీడింగ్/ డేంజరస్ డ్రైవింగ్ (సెక్షన్ 184) చలాన్లు నమోదయ్యాయి. ఈ చలాన్లలో చాలా వరకు నిజామాబాద్, శంషాబాద్, మేడ్చల్, చేగుంట, కరీంనగర్, దేవనపల్లి, సిద్దిపేట్, లంగర్ హౌస్, చేవెళ్ల, రామగుండం వంటి ప్రాంతాల్లో నమోదైనట్లు ఈ-చలాన్ వివరాల్లో తెలుస్తోంది.
కవిత వాహనం (Kavitha Vehicle) పై ఉన్న 15 చలాన్లకు రూ. 1,000 ఫైన్, ఇంకొక చలాన్ కి రూ. 200 అమౌంట్‌తో పాటు రూ.35 యూజర్ ఛార్జీలు విధించబడ్డాయి. దీంతో 16 చలాన్ల టోటల్ రూ.15,200 ఫైన్ అమౌంట్‌తో కలిపి యూజర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలతో సహా రూ.15,760కు చేరుకుంది. ఈ వివరాలు తెలంగాణ పోలీసుల అధికారిక ఈ-చలాన్ పోర్టల్‌లో పబ్లిక్ వ్యూ ద్వారా అందుబాటులో ఉన్నాయి.గత రెండు సంవత్సరాల కాలంలో (2024-2025) వివిధ తేదీల్లో ఈ చలాన్లు నమోదైనట్లు జాబితాలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై కల్వకుంట్ల కవిత ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, రాజకీయ నేపథ్యంలో ఉన్న ఆమె వాహనం మీద ఇంత పెద్ద ఎత్తున ఓవర్ స్పీడ్ చలాన్లు నమోదు కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Read Also: జీహెచ్ఎంసీలో భారీ బదిలీలు.. ఒకేసారి 140 మంది ట్రాన్స్ ఫర్
Follow Us On : WhatsApp


