కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ (Dilawarpur) మండలం కాల్వ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ (Fight Masters Ram Lakshman)లు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న రామ్ లక్ష్మణులకు ఆలయ పూజారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యాన్ని పూజారులు వారికి వివరించారు. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణులు మాట్లాడుతూ.. ఎంతో పురాతనమైన, ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

