కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) వివరణ ఇచ్చారు. కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లుగా తాను మాట్లాడిన మాటలు సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా విడుదల చేశారు.
ఒకరి చావు కోరుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదని, కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఏదో ఫ్లోలో అనేశానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల గౌరవం ఉందని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని, సందర్భాన్ని అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు.
కాగా, ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంలో కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో వివాదం మరీ తీవ్రతరం కాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే శంకర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వివరణ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
Also Read : డీప్‌ఫేక్ వీడియోల కలకలం.. కేటీఆర్ కీలక హెచ్చరిక!
Follow Us On: X(Twitter)

