ఆనంద్‌కు డబుల్ షాక్.. టైమ్‌తో ఓటమి!

కలం, స్పోర్ట్స్: చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌(Viswanathan Anand)కు గ్లోబల్ చెస్ లీగ్‌లో నాలుగో రోజు తీవ్ర నిరాశ ఎదురైంది. ఒక్కరోజే రెండు ఓటములు చవిచూశారు. 20 ఏళ్ల జవోఖిర్ సిందరోవ్‌(Javokhir Sindarov)తో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. సమయం ముగియడంతో ఆనంద్ ఓటమి పాలయ్యారు. అలాస్కన్ నైట్స్ తరఫున ఆడుతున్న ఆనంద్.. ముందుగా ఇయాన్ నెపోమ్నియాష్చితో తలపడ్డారు. ఆ గేమ్‌లో ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత సిందరోవ్‌తో మ్యాచ్‌లో ఆనంద్ మంచి స్థితిలో ఉన్నారు.

43వ ఎత్తులో సిందరోవ్ డ్రాకు అవకాశం ఇచ్చారు. అయితే అతడి పావులు సరైన సమన్వయంలో లేవని భావించిన ఆనంద్ (Viswanathan Anand) డ్రాను తిరస్కరించారు. గెలుపు కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత ఇద్దరి గడియారాల్లోనూ కొన్ని సెకన్లే మిగిలాయి. ఈ ఒత్తిడిలో ఆనంద్ తప్పిదం చేశారు. సమయం పూర్తవడంతో మ్యాచ్ సిందరోవ్‌దైంది. డ్రాను ఆనంద్ తిరస్కరించడం తనకు ఊరటనిచ్చిందని సిందరోవ్ తెలిపాడు. ఆనంద్ గడియారంపై ఒత్తిడిని తాను మానసికంగా ఉపయోగించుకున్నట్లు చెప్పాడు.

అదే సమయంలో ఆనంద్ స్థాయిని సిందరోవ్ ప్రశంసించాడు. దాదాపు 60 ఏళ్ల వయసులోనూ ఈ స్థాయిలో ఆడుతున్న ఆనంద్ ప్రపంచ స్థాయి ఆటగాడని పేర్కొన్నాడు. నాలుగో రోజు ముగిసే సరికి అలాస్కన్ నైట్స్ 6 మ్యాచ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. అమెరికన్ గాంబిట్స్, ఏపీఎల్ పైపర్స్, ముంబా మాస్టర్స్, గంగా గ్రాండ్‌మాస్టర్స్ చెరో 9 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి.

Also Read : కేసీఆర్‌పై వ్యాఖ్యల కలకలం.. ‘ఫ్లోలో అనేశాను’ అంటూ ఎమ్మెల్యే వివరణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>