కలం, వెబ్ డెస్క్ : నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో రూ.20,668 కోట్లతో చేపట్టే రెండు నేషనల్ హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాసిక్-సోలాపూర్ (Surat – Solapur) హై స్పీడ్ కారిడార్ (High Speed Corridor) కు ఆమోదం తెలిపారు. అలాగే రూ.19,142 కోట్లతో చేపట్టే 374 కి.మీ సూరత్-చెన్నై హై స్పీడ్ కారిడార్ ను కూడా నిర్మించబోతున్నారు. ఈ సూరత్-చెన్నై కారిడార్ కర్నూలు, కడప జిల్లాల మీదగా వెళ్తుంది. ఈ హైవే వల్ల 45 పర్సెంట్ జర్నీ టైమ్ తగ్గిపోతుంది.
ఇప్పటి వరకు సూరత్ నుంచి చెన్నైకి రావాలంటే 31 గంటలు పట్టేది. ఈ ప్రాజెక్ట్ వల్ల 17 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీన్ని రెండేళ్లలో నిర్మిస్తామని చెబుతున్నారు. చెన్న పోర్టుతో పాటు హజీరా పోర్టుకు కూడా కనెక్టివిటీని పెంచబోతున్నారు. అటు ఒడిశాలోని 326 హైవే వెడల్పు కోసం రూ.1526 కోట్లను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.
Read Also: మెరుపు సమ్మెలో గిగ్ వర్కర్లు
Follow Us On: Pinterest


