కలం, వెబ్ డెస్క్: శ్రీలంక (Sri Lanka) లెజెండ్రీ బౌలర్ లసిత్ మలింగా (Lasith Malinga) మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈసారి జట్టులోకి కాదు.. జట్టు మేనేజ్‌మెంట్ టీమ్‌లోకి. టీ20 వరల్డ్ కప్ ముందు శ్రీలంక క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. మలింగను ఫాస్ట్-బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించింది. మలింగది శాశ్వత నియామకం కాదు. ఇది కేవలం డిసెంబర్ 15 నుండి జనవరి 25 వరకు మాత్రమే ఉండనుంది.
ఇందులో మలింగ యాక్షన్‌లోకి దిగి ఫాస్ట్ బౌలర్లతో కలిసి డెత్ బౌలింగ్, ప్రిపరేషన్, అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. మలింగకు ఉన్న అంతర్జాతీయ అనుభవాన్ని, T20 క్రికెట్‌లో ప్రత్యేక నైపుణ్యాన్ని శ్రీలంక క్రికెట్ వినియోగించుకోవాలని భావిస్తోన్నామని శ్రీలంక క్రికెట్ బోర్డ్ తన ప్రకటనలో పేర్కొంది.
మలింగ (Lasith Malinga) గతంలో కూడా ఫాస్ట్ బౌలర్లకు మార్గదర్శకత్వం అందించి, జట్టు కోచింగ్ గ్రూప్‌తో కలిసి పని చేశారు. 16 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో 546 వికెట్లు సాధించి, 2014లో శ్రీలంకను T20 వరల్డ్ కప్ విజేతగా మార్చిన మలింగ, వైట్ బౌల్ క్రికెట్‌లో లెజెండరీ స్థానాన్ని సంపాదించారు. శ్రీలంక T20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 8న ఐర్లాండ్, ఫిబ్రవరి 12న ఓమన్, ఫిబ్రవరి 16నఆస్ట్రేలియాతో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడనుంది. మలింగ రావడం ద్వారా జట్టు ఫాస్ట్ బౌలింగ్ శక్తి మరింత బలపడనుంది. 20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌తో, తర్వాత ఫిబ్రవరి 12న ఓమన్ , ఫిబ్రవరి 16న ఆస్ట్రేలియా ఎదుర్కోవనున్నారు.
Read Also: రెండు జాతీయ రహదారులు.. కేంద్ర కేబినెట్ ఆమోదం
Follow Us On: Sharechat


