కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డికి సంబంధించిన అంశంపై తెలంగాణ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆధారాలను శాసనమండలికి పంపించాలని అసెంబ్లీ నిర్ణయించింది.
దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పై తదుపరి చర్యల కోసం పూర్తి ఆధారాలను శాసనమండలికి పంపించారు. తీర్మానం అనంతరం శాసనసభను రేపటికి వాయిదా వేశారు. కాగా, కాసేపటి క్రితం శాసనమండలికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రవేశపెట్టిన తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది.
Also Read : 823 రోజులు మాత్రమే, వదిలిపెట్టం.. కేటీఆర్ ఆగ్రహం
Follow Us On : WhatsApp

