బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీ షాక్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు (BRS MLAs) భారీ షాక్ తగిలింది. సోమవారం నాడు అసెంబ్లీ గేటు వద్ద ఘర్షణలకు సంబంధించి కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఫిర్యాదులో ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ వద్దకు నల్లటి టీ షర్టులు ధరించి రావడంతో పాటు స్పీకర్ ఆదేశాలను పాటించకుండా అసెంబ్లీలోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించారని పేర్కొన్నారు.

అదే సమయంలో.. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను దూషించడంతో పాటు కొందరు పోలీస్ సిబ్బందిని కూడా ఎమ్మెల్యేలు బెదిరించారని ఎఫ్క్ష్ఐఆర్‌లో తెలిపారు. కొందరు పోలీసుల కాలర్ పట్టుకోవడంతో పాటు కిందకు తోసేశారని ఇన్‌స్పెక్టర్ బాలస్వామి వివరించారు. ఈ నేపథ్యంలో 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వరుస కేసులు, అరెస్టులు..

అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సోమవారం జరిగిన పరిణామాలతో ఏకంగా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదైతే.. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరిని పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. వారం రోజుల పాటు అసెంబ్లీ జరగబోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతోందనన్న ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>