రవీందర్ నాథ్‌కు ఎస్‌డబ్ల్యూయూ (INTUC) ఆధ్వర్యంలో స్వాగతం

కలం, ​కరీంనగర్: హుజూరాబాద్ డిపో నుండి కరీంనగర్-2 డిపోకు (Karimnagar Depot) బదిలీపై వచ్చి సోమవారం నూతన డిపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ నాథ్ కు కరీంనగర్-2 డిపో SWU (INTUC) కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ​ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నూతన డీఎంకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం డిపో కార్మికులు మాట్లాడుతూ.. నూతన మేనేజర్ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. డిపో అభివృద్ధికి, సంస్థ పురోగతికి కార్మికుల తరఫున, కమిటీ పక్షాన పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి గట్టు రమేష్, డిపో కోశాధికారి బాబు, డిపో ముఖ్య సలహాదారు తిరుపతి, రాష్ట్ర నాయకులు P.R. రెడ్డి, K.S. రెడ్డి, రీజియన్ చైర్మన్ స్వామి, నాయకులు Ch.L.K. రావు, చారి, శ్రీధర్, శ్రీకాంత్, మహిళా జిల్లా కార్యదర్శి జ్యోతి, సరియా, MD.M. అలీ, మజీద్, శుభాని, రహీమ్, శంకరయ్య, రేణుక, గంగా జమున, రాధ, వినోద భాయి, మంజులలతో పాటు గ్యారేజ్ సిబ్బంది, డిపో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>