హామీలపై ప్రశ్నిస్తే అరెస్టులా..? కాంగ్రెస్‌పై వాకిటి శ్రీధర్ ఫైర్

కలం, వనపర్తి: వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt)వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపెడతారనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని అరెస్టు చేయిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ (Vakiti Sridhar) ఆరోపించారు. ఎమ్మెల్యేల అరెస్టు ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా నిలిచిపోతుందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా సోమవారం వనపర్తి (Wanaparthy) కలెక్టరేట్ ఎదుట పార్టీ నాయకులు మెరుపు ధర్నా (BRS Protest) నిర్వహించారు.

ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ (Vakiti Sridhar),  రమేష్‌గౌడ్ (Ramesh Goud) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను 33 నెలల పాలనలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. గత ఎనిమిది రోజులుగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో సమరభేరి మోగిస్తోందన్నారు.

అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు తీరును ప్రశ్నిస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలు అనే కనీస గౌరవం కూడా చూపకుండా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్శాసన పర్వాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Also Read : అసెంబ్లీ సాక్షిగా అవమానం.. సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>