కలం, మక్తల్ : ఈనెల 5, 6 తేదీలలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మౌంటెన్ సైక్లింగ్ (Mountain Cycling) పోటీలలో మక్తల్ (Makthal) ప్రాంత క్రీడాకారులు పాల్గొని, అసమాన క్రీడా ప్రతిభను కనబరిచి పతకాల పంటను పండించినట్లు సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం తెలిపారు.
మక్తల్ మండలంలోని మాద్వార్ గ్రామానికి చెందిన వడ్ల తేజస్విని (ఎనిమిదో తరగతి విద్యార్థిని, నర్వ గురుకుల పాఠశాల) సబ్ జూనియర్ బాలికల ఐదు కిలోమీటర్ల పోటీల విభాగంలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించడం జరిగిందన్నారు. అలాగే నర్వ కస్తూర్బా విద్యాలయంలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న జి.త్రివేణి 10 కిలోమీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సోమవారం మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వడ్ల తేజస్విని, జి.త్రివేణి లను సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఎస్ఓ లు అపరంజి, శిరీష, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Also Read : కీయా 140 కేజీల లిఫ్ట్ వైరల్.. ఆ తర్వాత ఏఐ వేధింపులు!
Follow Us On: X(Twitter)

