ఊరెడి ఆనంద్ యాదవ్‌కు జాతీయ ఉపాధ్యాయ పురస్కారం

కలం, ​కరీంనగర్: కరీంనగర్‌లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న సీనియర్ గణిత ఉపాధ్యాయుడు ఊరెడి ఆనంద్ యాదవ్‌ (Teacher Anand Yadav)కు ప్రతిష్టాత్మక “నేషనల్ టీచర్ ఎక్సలెన్స్ అవార్డు – 2026” లభించింది. ​నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

​ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఉత్తమ బోధనా పద్ధతులు, సృజనాత్మక ఆవిష్కరణలు, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తాజాగా కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి, కాటారం తదితర వివిధ ప్రాంతాలలో విద్యా సేవలు అందించిన ఉశిరెడ్డి ఆనంద్ యాదవ్ ఈ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ​ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, స్థానికులు, ఆల్ఫార్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి ఆనంద్ యాదవ్‌కు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>