కలం, సినిమా: దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా తీయడం.. ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం తెలిసిందే. వెంకీతో.. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీసాడు. ఇక నట సింహం బాలకృష్ణతో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా తీసాడు. ఇలా సీనియర్ హీరోలతో సినిమాలు తీసి.. సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
టాప్ హీరోలు ఆ నలుగురులో ఇక మిగిలింది టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రమే. ఆయనతో కూడా అనిల్ రావిపూడి సినిమా చేయాలి అనుకుంటున్నారు. గతంలో ఈ క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి. నాగార్జునతో మూవీ గురించి సుప్రియతో అనిల్ రావిపూడి మాట్లాడారని.. మంచి కథతో వస్తే.. ఖచ్చితంగా చేద్దామని చెప్పారని ఇండస్ట్రీలో ఆమధ్య వినిపించింది. ప్రస్తుతం నాగార్జున 100వ సినిమా చేస్తున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత నాగ్ సినిమా ఎవరితో అనేది కన్ ఫర్మ్ కాలేదు. ప్రజెంట్ ఫోకస్ అంతా నాగ్ 100వ సినిమా పైనే ఉంది. మరో వైపు అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ కారణాల వల్లే నాగ్ 101వ సినిమా అనిల్ రావిపూడితో (Anil Ravipudi) చేయొచ్చేమోనన్న ప్రచారం సాగుతోంది. అయితే.. నాగ్ 101 కాకపోయినా కాస్త లేట్ అయినా సరే.. అనిల్ తో నాగ్ మూవీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. ఈ క్రేజీ కాంబో మూవీ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
Read Also: డైరెక్టర్ మారుతిని అల్లు అర్జున్ నమ్మడం లేదా?
Follow Us On : WhatsApp


