విశాఖ బీచ్‌లో మత్స్యకారుడి దారుణ హత్య

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం (Visakhapatnam) ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బీచ్ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం బీచ్ లో డెడ్ బాడీ ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చంటి (35) అనే వ్యక్తి ఈ దారుణహత్యకు గురయ్యారు. అతడు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపల వేట సాగిస్తూ జీవనం కొనసాగించేవాడు. భార్య, పిల్లలతో కలిసి పెయిన్ దొరపేటలో నివాసం ఉంటున్న అతన్ని చంపేస్తామని కొందరు వ్యక్తులు ఆదివారం బెదిరించారు. ఈ విషయాన్ని చంటి తన సోదరితో చెప్పాడు. ఈ మేరకు మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో చంటి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. అతని తలపై కర్రతో కొట్టిన ఆనవాళ్లతో పాటు మెడ చుట్టూ నైలాన్ తాడు బిగించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దీన్ని హత్యకు అనుమానిస్తున్న పోలీసులు.. డెడ్‌ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>