ప్రభుత్వ హామీలపై గణేష్​ బిగాల ఫైర్.. అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ (Nizamabad) అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Ganesh Bigala ) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ ఫూలాంగ్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా ఇప్పటివరకు వాటిని తీర్చలేదని విమర్శించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశామన్నారు.

“అయ్యా… మీరైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడండి” అని అంబేద్కర్ విగ్రహాన్ని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>