కలం, వరంగల్ బ్యూరో: అనారోగ్య సమస్యలు భరించలేక జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. బుధవారం జనగామ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం చిన్నరామచర్లకు చెందిన వృద్ధ దంపతులు పుర్మ రామ్ రెడ్డి (80), లక్ష్మి (70) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారి బాగోగులు చూసుకునేవారు లేకపోవడంతో బుధవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బచ్చన్నపేట SI హమీద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జనగామ (Jangaon) ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై క్రిమినల్ కేసు
Follow Us On : WhatsApp


