కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) ఈ రోజు ఉదయం 10 గంటలకు అన్ని మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులతో కీలక సమీక్ష చేయబోతున్నారు. సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. ప్రధాన కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, మంత్రిత్వ శాఖల్లోకి కీలకమైన అధికారులతో మాత్రమే ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. కేంద్ర మంత్రుల పనితీరు ఎలా ఉంది.. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా చేస్తున్నారు.. అనే అంశాలపై ప్రధాని మోదీ తెలుసుకోనున్నారు. గతంలో కూడా ఒకసారి ప్రధాని ఇలాంటి సమీక్షనే నిర్వహించగా.. ఇది రెండోది కావడం గమనార్హం.
త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన ..?
ప్రధాని మోదీ (PM Modi) త్వరలోనే కేంద్ర మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొంతకాలంగా కేంద్ర మంత్రుల పనితీరుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా అందరి పనితీరు రిపోర్టులు ప్రధాని కార్యాలయానికి చేరినట్లు సమాచారం. పునర్వ్యస్థీకరణలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయని విశ్లేషిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : గ్లోబల్ చెస్ లీగ్‌లో అమెరికన్ గాంబిట్స్ ఊచకోత
Follow Us On: X(Twitter)

