సీఎం రేవంత్ ఇలాకాలో కవిత సభ

కలం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించనున్నట్లు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. కొడంగల్ సెగ్మెంట్‌లోని కోస్గిలో ఈ నెల 23న ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం భారీ స్థాయిలో జనసమీకరణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కొడంగల్ నుంచే శంఖారావం పూరించనున్నట్టు కవిత ప్రకటించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కోస్గి పాంచజన్యం సభలో ఒక్కో పథకం ఫెయిల్యూర్‌ను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు సగం కూడా అమలు కాలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి మహిళకు ఎకరం భూమి, బీసీలకు రాజ్యాధికారంలో తగిన ప్రాధాన్యం ఇస్తామని కవిత హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>