ఎయిర్‌పోర్టులో భీకర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని మయామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం (Miami Plane Crash) చోటుచేసుకుంది. ప్యూర్టో రికోలోని సాన్ జువాన్ నుంచి మయామికి బయలుదేరిన అమెజాన్ బోయింగ్ 767 కార్గో ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వేను దాటుకుని గోడౌన్‌, రోడ్డు పైనున్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ఘర్షణతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఆకాశాన్ని తాకేలా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 60కి పైగా అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. విమానంలోని పైలట్లతో పాటు ప్రమాదంలో చిక్కుకున్న పలు వాహనాల డ్రైవర్లను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. అయితే ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరొక ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపమా? వాతావరణ సమస్యల వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు వేగవంతం చేసింది.

Also Read : ఢిల్లీలో తీవ్ర విషాదం.. ఆరుగురి మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>