కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ భద్రత కోసం రూ.20 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రెండు సార్లు సీఎంగా, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాయకుడన్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కూడా కాదని.. ఆయనకు నలుగురు గన్ మెన్లు, రూ.40 కోట్లతో ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి గౌరవం లేకుండా అభ్యంతరకర పదాలు వాడటం సీఎం స్థాయి వ్యక్తికి తగునా.. అని మండిపడ్డారు. అందుకే కౌరవ సభ లాంటి అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని తాము కేసీఆర్కు చెప్పామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక..
నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కేసీఆర్ (KCR) తీవ్రంగా తప్పుబట్టారని హరీశ్ రావు (Harish Rao) వివరించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులపై రైతాంగానికి చేస్తున్న నష్టంపై ప్రత్యక్ష పోరాటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే.. లక్షలాది మంది రైతులతో కలిసి నీళ్ల పోరాటాలు చేయబోతున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీని నెల రోజుల పాటు జరపాలని స్పీకర్ను కోరుతామన్నారు. తమకు సరిపడా సమయం ఇవ్వకపోతే.. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Also Read : రోడ్లపై కాదు.. అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On : WhatsApp

