కలం, వెబ్ డెస్క్: సంక్రాంతికి విడుదల కాబోయే భారీ బడ్జెట్ సినిమాల్లో ది రాజా సాబ్ ఒకటి. ఈ చిత్రానికి 500 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు అయినట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏమిటంటే.. డైరెక్టర్ మారుతి (Maruthi) సైతం భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నాడు. 18 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు తెలిపారు. దాదాపు మూడు సంవత్సరాలపాటు ఒకే ప్రాజెక్టు కోసం పనిచేసినందుకుగాను ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇది మారుతి (Maruthi) కెరీర్‌లో ఇప్పటివరకు పొందిన అత్యధిక పారితోషికం అని సమాచారం. ఇది దర్శకుడికి ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. సినిమా స్థాయి, దాని చుట్టూ ఉన్న అంచనాలను బట్టి చూస్తే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం సరైందేనని చెప్పకతప్పదు. ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రం జనవరి 9న పాన్-ఇండియాగా విడుదల కానుంది. ఇప్పటికే ది రాజా సాబ్ (The Raja Saab) మూవీకి మంచి బజ్ ఉంది. మారుతి పారితోషికం కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
Read Also: విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై క్రిమినల్ కేసు
Follow Us On : WhatsApp


