కలం, వెబ్ డెస్క్: సినిమాలు చేయడంలో కొంత వేగం తగ్గించినా నటి సమంత (Samantha) క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. 2025లో ప్రేక్షకులు ఊహించినస్థాయిలో సమంత సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంది. ఆధ్యాత్మిక పర్యటనలు, ఇతర వ్యాపకాలతో గడిపి అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ ఇయర్‌లో చిత్రనిర్మాత రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకొని మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సమంత సినిమాలు చేస్తుందా? లేదా? అనేది అభిమానుల్లో ఒకింత సందేహం ఉంది. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. సమంత వరుస సినిమాలు చేయబోతోంది.
2026లో (New Year) సమంత సెట్స్‌లో అడుగుపెట్టబోతోంది. ఆమె సొంత నిర్మాణంలో రూపొందుతున్న “మా ఇంటి బంగారం”లో కథానాయికగా కనిపించనుంది. ఈ ప్రాజెక్టు సమంతకు కీలకం కానుంది. అలాగే కొత్త సినిమాలకు సైన్ చేసే అవకాశం ఉంది. సమంత గతంలో వెబ్ సిరీస్‌లు చేసింది. మళ్ళీ వెబ్ డ్రామాలతో బిజీగా ఉంటుందా? లేక వరుసగా సినిమాలు చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. సమంతకు (Samantha) అటు యూత్, ఇటు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. 2026లోనైనా పెద్ద హీరోలతో జోడీ కట్టాలని ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. MAAపై కీలక ఆరోపణలు
Follow Us On: Pinterest


