కలం వెబ్ డెస్క్ : అక్రమ పైరసీ కేసు(Piracy Case)లో అరెస్ట్ అయ్యి పోలీస్ కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి(iBomma Ravi) 12 రోజుల విచారణ పూర్తయ్యింది. నేడు ఆయన కస్టడీ రిపోర్ట్‌ను పోలీసులు కోర్ట్(Court)లో సమర్పించారు. ఈ రిపోర్ట్‌తో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రవి ఇప్పటి వరకు రూ.13 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో సుమారు రూ.10 కోట్లు విలాసవంతమైన జీవితానికే ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఐబొమ్మ రవి ఐదు ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసినట్లు పేర్కొన్నారు. రవి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.
రవికి 2007 నుంచే పైరసీ ఆలోచనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీని కోసం రవి (iBomma Ravi) తన స్నేహితులు అంజయ్య, ప్రహ్లాద్, ప్రసాద్‌ల ధ్రువీకరణ పత్రాలతో 3 ఫేక్ కంపెనీలు సృష్టించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. సదరు కంపెనీల పేర్లను supplier India, hospital inn, Err infotech గా వెల్లడించారు. ఈ కంపెనీలు, నకిలీ ఆధారాల కోసం ముందు నుంచే రవి తన స్నేహితుల నుంచి డాక్యూమెంట్లు దొంగతనం చేస్తూ వచ్చాడట. ఈ కేసులో రామగుండంకు చెందిన అంజయ్య కీలకమని పోలీసులు భావిస్తున్నారు. అంజయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మంలో కేసు నమోదు
Follow Us On: X(Twitter)


