విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే దిక్సూచి: మేఘారెడ్డి

కలం, వనపర్తి: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యత, నైతికతను నేర్పడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.

విద్యా రంగ అభివృద్ధికి..

విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు మెరుగైన విద్యా అవకాశాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసే అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న 55 మంది ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్ మధుసూదన్‌ గౌడ్‌, సీఎంవో ప్రతాప్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>