కలం వెబ్ డెస్క్ : ఇటీవల సింహాచలం(Simhachalam) అప్పన్న ప్రసాదంలో నత్త(snail) వచ్చిందని ఇద్దరు భక్తులు(devotees) సోషల్ మీడియాలో వీడియో పెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 29న సింహాచలం క్షేత్రానికి వెళ్లామని, ప్రసాదం పులిహోరలో నత్త వచ్చిందని సదరు భక్తులు వీడియోలో వెల్లడించారు. దీనిపై ఆలయంలో ప్రసాదం కౌంటర్‌లో ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నత్త వచ్చిన పులిహోర ప్యాకెట్ తీసుకొని మరో ప్యాకెట్ ఇచ్చి పంపించారని పేర్కొన్నారు.
పులిహోర ప్రసాదాన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని తినాలని భక్తులకు సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన సింహాచలం (Simhachalam) ఆలయ అధికారులు వీడియో పోస్ట్ చేసిన భక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులిహోరపై కావాలనే దుష్ప్రచారం చేశారని, వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: సింహాచలం ప్రసాదంలో నత్త.. అంతా ఉత్తదేనా?
Follow Us On: Sharechat


