కలం వెబ్ డెస్క్ : ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్(YouTuber Anvesh)పై ఖమ్మం(Khammam)లో కేసు నమోదైంది. ఇటీవల హిందూ దేవతలను, స్త్రీలను కించపరిచే విధంగా అన్వేష్ వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలోని దానవాయిగూడెంకు చెందిన జి.సత్యనారాయణరావు అన్వేష్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను, మహిళలను అగౌరవపరిచే విధంగా అన్వేష్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజంలో అశాంతి ఏర్పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు అన్వేష్ సీతాదేవి, ద్రౌపది, ప్రవచనకర్తలను అవమానించాడంటూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాదాల కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అన్వేష్ ప్రపంచ యాత్రలు చేస్తూ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేస్తూ జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. నా అన్వేషణ (Naa Anveshana) అనే పేరుతో బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల నటుడు శివాజీ(Shivaji) హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యల నుంచే అన్వేష్ వివాదం మొదలైంది. శివాజీ వ్యాఖ్యలను ఖండించిన అన్వేష్ బూతు పదాలను వాడుతూ నెటిజన్లకు తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో నటుడు శివాజీని, ప్రముఖ హైందవ ప్రవచన కర్త గరికపాటిని బూతులు తిట్టాడు. సీతాదేవి, ద్రౌపదిలను ఉదహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
దీంతో నెటిజన్లు అన్వేష్‌పై (YouTuber Anvesh) ఫైర్ అవుతున్నారు. అతని యూట్యూబ్, సోషల్ మీడియాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా రోజురోజుకూ లక్షల్లో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. దీంతో అన్వేష్ తన వ్యాఖ్యలపై క్షమాపణ కూడా చెప్పాడు. కానీ, నెటిజన్లు మాత్రం తగ్గేదేలే అన్నట్లు అన్వేష్‌పై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా ఓ కేసు కూడా నమోదవడంతో ఇంకా అన్వేష్ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను సైతం దాటేసి!
Follow Us On: X(Twitter)


