కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు(Pensions) అందుకుంటున్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం చంద్రబాబు (Chandrababu) ఎక్స్ వేదికగా నేడు ఓ పోస్టు చేశారు. కొత్త సంవత్సరమంతా అందరికీ మంచే జరగాలని ఒకరోజు ముందుగానే పెన్షన్ సొమ్ము అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకుపైగా పెన్షన్లపై ఖర్చు చేసినట్లు తెలిపారు.
డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. జనవరి 1వ తేదీన పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నా కొత్త ఏడాది (New Year) సందర్భంగా ఒక రోజు ముందే 31వ తేదీన అందిస్తున్నట్లు తెలిపారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పెన్షన్ పంపిణీ ఆయనకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమమని చంద్రబాబు (Chandrababu) తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also: సింహాచలం ప్రసాదం కేసులో సీన్ రివర్స్.. బాధితులపై పోలీసుల విచారణ
Follow Us On: Sharechat


