కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఓ (AO)గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ (Srinivas) జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల శనివారం శ్రీనివాస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ నిర్మల్ జిల్లాలో ఏఓగా శ్రీనివాస్ అందించిన సేవలను కొనియాడారు.
జగిత్యాల జిల్లాలో చేపట్టనున్న నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకుని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ఏఓ యూనస్ అలీ పాల్గొన్నారు.

