కలం, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) తన పొలిటికల్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశారు. త్వరలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని అయ్యన్న ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నర్సీపట్నంలో జరిగిన వేడుకల్లో అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఇక విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మూడేళ్ల పదవీ కాలంలో నర్సీపట్నంలో వీలైనన్ని అభివృద్ధి పనులు చేస్తానన్నారు.
అయ్యన్నపాత్రుడు ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిసారి నర్సీపట్నం నుంచే ప్రాతినిథ్యం వహించారు. ఆయన రాజకీయ జీవితమంతా టీడీపీలోనే ఉన్నారు. మంత్రిగా, స్పీకర్గా కూడా సేవలందించారు. ఒకసారి టీడీపీ తరఫున అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు చింతకాయల విజయ్ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు 70వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రాజకీయాలకు రిటైర్మెంట్ గురించి ప్రకటన చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

