కలం వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara)కి నకిలీ ఆభరణాల(Fake Ornaments)తో అలంకరణ చేయడం కలకలం రేపింది. నంద్యాల జిల్లా(Nandyal District) చాగలమర్రి మండలంలోని మద్దూరు ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం వైకుంఠ ఏకాదశి రోజు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం తరఫున భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామి వారిని నిత్యం వెండి ఆభరణాలతో(Silver Ornaments) అలంకరిస్తారు. కానీ, ఏకాదశి రోజు నకిలీ ఆభరణాలతో అలంకరించినట్లు భక్తులు గుర్తించారు. దీంతో అసలు వెండి ఆభరణాలు ఏమయ్యాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భక్తులు భావిస్తున్నారు. ఎవరైనా చోరీ చేసి నకిలీ ఆభరణాలు పెట్టారా? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అనే విషయాలపై పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
Read Also: పెన్షనర్లకు సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ విషెస్!
Follow Us On: Youtube


