విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ పాఠశాల (Annasagar School) లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయరాలిగా ఎంపికైన కె. జ్యోతిని సన్మానించారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బోధన చేస్తారని, చెప్పే విషయాలను శ్రద్ధగా వింటే ఎన్నో విజయాలు సాధించగలుగుతారని ఆయన అన్నారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుని విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. చెడు స్నేహాన్ని వదిలిపెట్టి చదువుపైనే దృష్టి పెట్టాలని సర్పంచ్ అన్నారు.

వసంత చెన్నయ్య మాట్లాడుతూ.. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని, విద్యార్థులు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తూ తమ సందేహాలను తీర్చుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల్లో అపారమైన జ్ఞానం ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ విద్య పైన దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, వార్డు సభ్యులు నవీన్ సుదర్శన్ రెడ్డి, శేఖర్, తిరుపతయ్య, యాదయ్య, నరేందర్‌తో పాటు ఉపాధ్యాయులు చక్రవర్తి గౌడ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>