కేసీఆర్‌‌‌కు కాంగ్రెస్ షాక్.. మహా ధర్నాకు సిద్ధం!

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌‌‌ (KCR)పై అధికార కాంగ్రెస్ ఆందోళనలకు సిద్ధమవుతోంది. వెయ్యి రోజులుగా ప్రజా ధనాన్ని తీసుకుంటూ.. ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదంటూ ఆదివారం నాడు మహా ధర్నా (Congress Maha Dharna) చేపట్టబోతుంది. హైదరాబాద్‌లోని ఇందిరా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించబోతుండగా.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరు కాబోతుండటం గమనార్హం. ఏర్పాట్లపై రేపు ఉదయం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్య నేతలతో ఇద్దరు మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఆదివారం జరిగే ధర్నాను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు.

సీఎం పిలుపునివ్వడంతో..

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలం అయ్యారని, ఆయన రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. ఆదివారం కూడా మహా ధర్నా (Congress Maha Dharna) నిర్వహించబోతుండటం, దానికి పార్టీ కీలక నేతలు హాజరు కాబోతున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈసారైనా సభకు వస్తారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : వరంగల్‌లో హనీట్రాప్.. ప్రేమ పేరుతో రూ.15 లక్షల మోసం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>