బీఆర్ఎస్‌లోకి కొండా సురేఖ.. జగదీశ్ రెడ్డి ఏమన్నారంటే?

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతోంది రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాదు.. ఏపీ సీఎం చంద్రబాబేనని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇస్తే.. కరెంట్, ఎరువులు, బోనస్ పంచాయితీలు వస్తాయని కావాలనే ప్రభుత్వం నీళ్లను వదిలేస్తుందని మండిపడ్డారు.కాంగ్రెస్ నేతలంతా ప్రజల సమస్యలను గాలికొదిలేసి కమీషన్ల కొట్లాటల్లో మునిగిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన అంతా ద్రోహమని, 420 హామీల మోసమేనంటూ దుయ్యబట్టారు.

ఆ ఆలోచన మాకు లేదు..

ఇక కొండా సురేఖ(Konda Surekha)ను మంత్రి పదవి నుంచి తొలగించడంపై జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ఆలోచన తమకు లేదని.. తమ వైపు నుండి ఆ ప్రయత్నం కూడా చేయడం లేదని స్పష్టం చేశారు. అసలు తొలుత బర్తరఫ్ చేయాల్సింది కొండా సురేఖను కాదని, రేవంత్ రెడ్డిని అంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ సమాజంలోదొంగతనం చేశాడని చూపించిన వాడిని అరెస్ట్ చేసి.. దొంగను వదిలిపెట్టే సంస్కృతి కనబడుతోందని దుయ్యబట్టారు. రేవంత్ సర్కార్ అవినీతిని ఆధారాలతో సహా కొండా సురేఖ కుటుంబం బయటపెట్టిందనే ఆమెపై చర్యలకు పాల్పడ్డారని అన్నారు. దీనిని తాము ముందునుంచే చెబుతున్నామని అన్నారు.

ఆ ఆరోపణల సంగతేంటి?

కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోందని, ఇప్పటికే తాము అనేక ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపించామని జగదీశ్ రెడ్డి తెలిపారు. వీటిపై చర్యలు తీసుకోవాలనికేంద్రాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సాధించింది ఒక మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమేనని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అది కాంగ్రెస్ నేతల అంతర్గత విషయం కానీ.. కొండా సురేఖ కూతురు సుస్మిత బహిరంగంగా చేసిన ఆరోపణల సంగతేంటి? అంటూ ప్రశ్నించారు. దోపిడీ సొమ్ము పంచుకోవడంలో దొంగలు కొట్టుకొని దొరికిపోయినట్టుగా, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ దొరికిపోయిందని దుయ్యబట్టారు.

Also Read : కృష్ణాష్టమికి అనసూయ స్పెషల్ డ్యాన్స్.. వీడియో వైరల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>