కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు రోజుల పాటు కొండగల్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరుకు సీఎం చేరుకున్నారు. మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను రేవంత్ పరిశీలించారు. కాలేజ్ నిర్యాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు ఉండాలని, కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా, పది సంవత్సరాల క్రితం ప్రజల అవసరాల కోసం సొంత డబ్బులతో సీఎం రేవంత్ సొంత డబ్బులతో భూమి కొనుగోలు చేశారు. అదే స్థలంలో ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టారు. ఆనాడు ముందుకు వచ్చి భూములు ఇచ్చిన రైతులను గుర్తించి ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

