శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. పోల్ ను ఢీకొన్న విమానం!

కలం, వెబ్ డెస్క్ : నేవీ ముంబై నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్టు (Srinagar Airport) చేరుకున్న ఇండిగో విమానం 6E 225 (VT-NOG) కి శుక్రవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ పూర్తయిన తర్వాత పార్కింగ్ ఏరియాలోని బే నంబర్ 6 లో ప్లేన్‌ను పార్క్ చేస్తున్న సమయంలో అది ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన ఆ పోల్ విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) లో భాగమని, ఇది విమానాలను సురక్షితంగా పార్క్ చేయడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను, విమాన సిబ్బందిని మ్యాన్యువల్ ఎయిర్‌క్రాఫ్ట్ మెట్ల సహాయంతో కిందకు దించి సురక్షితంగా టెర్మినల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయని, మిగతా విమానాల రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని విమానాశ్రయ వర్గాలు ధృవీకరించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>