అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా అన్ని రకాల మౌలిక వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రాలు పిల్లలను ఆకట్టుకునే విధంగా రంగురంగుల బొమ్మలు, పెయింటింగ్స్, వర్ణమాల, విద్యా చార్టులతో అలంకరించి, ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్యాబోధన అందించాలని తెలిపారు.

చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడేలా ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటలు, రైమ్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఎత్తు, బరువు తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. చిన్నారులతో రైమ్స్ చెప్పించి, సంఖ్యలు చదివించడంతో పాటు వారికి చాక్లెట్లు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, వైద్యారోగ్య శాఖ అధికారులు పవన్ కుమార్, సౌమ్య, నయనా రెడ్డి, రమేష్, అలీ, సర్పంచ్ హరీష్, ఉప సర్పంచ్ భూమేష్, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>