కలం, వెబ్ డెస్క్: బిగ్ బ్యాష్ లీగ్ 15వ సీజన్ నుంచి పాక్ ప్లేయర్ షాహిన్ అఫ్రిదీ (Shaheen Afridi) తప్పుకున్నాడు. బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున ఆడుతున్న షాహిన్.. మోకాలి గాయం కారణంగా మిగిలిన టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. డిసెంబర్ 27న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన అనంతరం, స్ట్రైకర్స్ రన్ చేజ్‌లో 14వ ఓవర్ సమయంలో కుడి మోకాలిని పట్టుకుని మైదానాన్ని విడిచిపెట్టారు.
షాహీన్ ఇప్పటికే రిహ్యాబిలిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాడని బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం తెలిపింది. అడిలైడ్ నుంచి జట్టు తిరిగివచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సమీక్షించనున్నారు. ఇదిలా ఉండగా, షాహీన్ అఫ్రిది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తనను తిరిగి పిలిపించుకున్నట్లు వెల్లడించారు. బ్రిస్బేన్ హీట్ జట్టు, అభిమానులు తనకు చూపిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
“అనుకోని గాయం కారణంగా PCB నన్ను వెనక్కి పిలిపించింది. ప్రస్తుతం రిహ్యాబ్ తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే మళ్లీ మైదానంలోకి వస్తానని ఆశిస్తున్నాను. ఈలోగా జట్టుకు మద్దతుగా నిలుస్తాను,” అని షాహీన్ (Shaheen Afridi) పేర్కొన్నారు. రాబోయే శ్రీలంక పర్యటనకు ఎంపికైన పాకిస్థాన్ టీ20 జట్టులో షాహీన్ అఫ్రిది చోటు దక్కలేదు. బీబీఎల్ 15లో పాల్గొనడం కారణంగా బాబర్ ఆజమ్‌తో పాటు షాహీన్‌ను తాజా జట్టులో చేర్చలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Read Also: టీ20 వరల్డ్ కప్ 2026కు ఇంగ్లండ్ జట్టు ఖరారు
Follow Us On: Instagram


