హైకోర్టులో రంగనాథ్‌కు ఊరట.. సింగిల్​ బెంచ్​ ఆర్డర్​ రద్దు

కలం, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో (TG High Court) ఊరట లభించింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తనను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసి, కమిషనర్‌గా కొనసాగేలా తీర్పు ఇవ్వాలని రంగనాథ్ కోరారు. దీనిపై హైకోర్టులో వాదనలు కొనసాగడంతో సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 3వ తేదీకి కు వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>