వివక్ష, అంటరానితనానికి కాంగ్రెస్ వ్యతిరేకం : సంజీవ్ ముదిరాజ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : దేశంలో కుల వివక్ష అంటరానితనం ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీ ముందుండి వ్యతిరేకిస్తుందని మహబూబ్‌నగర్ డిసిసి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) అన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పట్ల జరిగినట్లు ఆరోపణలు ఉన్న కుల వివక్ష, అంటరాని చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసిన కాపీని సీఐ ఎం.డి.ఎజాజుద్దీన్ కి అందజేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ సంబంధిత ఎస్సైకి ఎఫ్‌ఐ‌ఆర్ కాపీని అందజేశారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్‌లో మహబూబ్‌నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి సీఐకి ఎఫ్‌ఐ‌ఆర్ కాపీని అందజేశారు.

ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ కుల వివక్ష, అంటరానితనం జరిగినా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కుల వివక్షకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, నాయకులు ప్రవీణ్ కుమార్, తాహెర్, మేఘ్యా నాయక్, రాములు యాదవ్, గోపాల్ యాదవ్, ఉషారాణి, నరేష్, మురళీ గౌడ్, చందు యాదవ్, వెంకట్ లక్ష్మి, సహజ, బండి మల్లేష్, కోట్ల చంద్రయ్య, రియాజుద్దీన్, అషు, అకీమ్, రాజేష్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, అబూకర్ తదితరులు పాల్గొన్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>