గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాల ప్రాధాన్యం: ఎమ్మెల్యే పవార్‌

కలం, నిర్మల్ : గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ముధోల్‌ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్‌ రామారావు పటేల్‌ అన్నారు. సోమవారం బాసర మండలంలోని దోడాపూర్‌, కిర్గుల్‌-బి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. దోడాపూర్‌ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫంక్షన్‌ హాల్‌ కు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

అనంతరం కిర్గుల్‌-బి గ్రామంలో రూ.45 లక్షలతో చేపట్టనున్న మహిళా సమైక్య సంఘ భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన (Mudhole MLA) మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం బాసర మండల కేంద్రంలోని పాపహరేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : పింఛన్‌‌దారులకు బిగ్ అలర్ట్.. గడువు పెంపు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>