కలం, నిర్మల్ : తానూర్ మండలం కోలోర్ గ్రామంలో సోమవారం పోలీసులు (Tanur Police) కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 70 వాహనాలను స్వాధీనం చేసుకుని, నిబంధనల మేరకు జరిమానాలు విధించారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
రానున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్ నాయక్, ఎస్సైలు షేక్ జుబేర్, ప్రదీప్, పెర్సిస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : నల్లగొండలో ఉద్రిక్తత.. మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి
Follow Us On: Instagram

