కలం, సినిమా: టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ , గాయకుడు కాలభైరవ, యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ (Kaala Bhairava – Kavya Kalyanram) జంట తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసిన ఫోటోలను పంచుకున్నారు.
కాలభైరవ .. సంగీత దర్శకుడిగా, సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆస్కార్ వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాటను కూడా పాడారు.బాల నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన కావ్య కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత మసూద, బలగం వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కాలభైరవ,కావ్య కళ్యాణ్ రామ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వారు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో పలువురు సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.

