కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని.. వివిధ రంగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మూసారాంబాగ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి ముసారాంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మూడు కార్పొరేషన్ల కొత్త లోగోలను ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ నగరం అన్ని వర్గాల వారికి ఆశ్రయమివ్వడంతో పాటు గొప్పగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతున్నా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

