గద్వాలలో పాన్ డబ్బాలో చోరీ.. సెల్ ఫోన్లు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కేంద్రంలో పాన్ డబ్బాలో చోరీ జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గద్వాల పట్టణానికి చెందిన సుధీర్ పాతబస్టాండ్ వైఎస్ఆర్ చౌరస్తాలో పాన్ డబ్బా ఏర్పాటు చేసుకుని సిగరెట్లు, పాన్ మసాలలతో పాటు, సెల్‌‌ఫోన్ల రీచార్జ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు‌. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పాన్ షాప్‌ను మూసి వేసి ఇంటికి వెళ్లాడు.

సోమవారం వేకువజామున గస్తీ నిర్వహించే గుర్ఖాలు పాన్ షాపు తెరిచి ఉండటాన్ని గమనించడంతో నిర్వాహకుడు సుధీర్‌కు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు పాన్ డబ్బా తాళాలు పగులగొట్టి, పాన్ డబ్బాలో దాచి ఉంచిన రూ. 80వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లు చోరి చేయడంతో గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. గద్వాల టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>