కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ తుక్కుగూడలో నర్స్ హత్య, అత్యాచారం (TukkuGuda Nurse Murder) ఘటనకు పాల్పడింది చెందిన సనా ఉల్లాఖాన్ (34) అని పోలీసులు తేల్చారు. నిందితుడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉండటాన్ని చూసి షాకయ్యారు. కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ రాజేశ్ వెల్లడించారు. ‘ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 21 ఏళ్ల నర్స్.. అక్కడే సిబ్బందికి కేటాయించిన గదిలో నివాసం ఉంటున్నారు. సనా ఉల్లాఖాన్ అనే వ్యక్తి ఆసుపత్రి పక్కనే బైక్ షాపులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
ఇతడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాడు. మూడు నెలల కిందటే నగరానికి వచ్చాడు. భార్యా, పిల్లలు కూడా ఉన్నారు. నర్స్ ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన సనా ఉల్లాఖాన్ పలుమార్లు ఆమె గదిలోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కిచెన్ వైపు ఉన్న కిటికీ ద్వారా లోపలికి చొరబడ్డాడు. అతడిని చూసి నర్స్ కేకలు వేయగా.. గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు’ అని డీసీపీ వెల్లడించారు.
ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో..
శనివారం ఉదయం నర్స్ స్నేహితులు ఫోన్ చేసినా, డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో.. మహేశ్వరంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని డీసీపీ రాజేశ్ పేర్కొన్నారు. ‘వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టగా.. లోపల నర్స్ అచేతనంగా పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలను పరిశీలించిన తరువాత సనా ఉల్లా ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు’ అని తెలిపారు. నిందితుడి ఫోన్ చేయగా.. పోర్న్ కంటెంట్ ఎక్కువగా చూస్తున్నట్లు గుర్తించామన్నారు. అశ్లీల వీడియోలకు బానిసగా మారి.. ఈ దారుణానికి పాల్పడినట్లు వివరించారు. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడేలా.. త్వరగా విచారణ ముగిసేలా చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు.

