కలం, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు రావడం.. మహేష్ బాబు (Mahesh Babu) సూపర్ స్టార్‌గా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే.. రమేష్ బాబు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు అనేది వాస్తవం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ (Jayakrishna) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రేజీ మూవీకి అజయ్ భూపతి దర్శకుడు. ఈ సినిమాకి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా నుంచి జనవరి 1న ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జయకృష్ణ (Jayakrishna) హీరోగా నటిస్తున్న ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సమర్పణలో పీ కిరణ్ నిర్మాణంలో చందమామ కథలు బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంలో సాగే కథ అని.. తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలిసింది.
ఈ సినిమా మెయిన్ స్టోరీనే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిం అందరి దృష్టిని ఆకర్షించారు. ఆతర్వాత మహా సముద్రం సినిమాతో నిరాశపరిచినా మంగళవారం సినిమాతో మళ్లీ సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు రమేష్ బాబు (Ramesh Babu) వారసుడు జయకృష్ణను పరిచయం చేస్తూ శ్రీనివాస మంగాపురం అంటూ ఓ కొత్త కథతో వస్తున్నారు. మరి.. సూపర్ స్టార్ కృష్ణ మనవడుగా, రమేష్ బాబు తనయుడుగా, మహేష్ బాబు అన్న కొడుకుగా.. జయకృష్ణ హీరోగా రాణిస్తాడేమో చూడాలి.
Read Also: ఆ హీరో నా కెరీర్ ను మలుపుతిప్పాడు.. అనిల్ రావిపూడి కామెంట్స్
Follow Us On: Youtube


