కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పాలనపై సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బృహత్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay) ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడుస్తున్నప్పటికీ, పాలనలోనూ, హామీల అమలులోనూ పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడంతో పాటు, ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ నిరసనలను ఉధృతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన (Puvvada Ajay) తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో జరిగే ఈ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
Also Read : 25వ గ్రాండ్‌స్లామ్ కోసం జకోవిచ్ చివరి పోరాటం!
Follow Us On: X(Twitter)

